Thursday, August 6, 2026
Google search engine
Home ఆధ్యాత్మికం కల్వకుర్తి పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: శ్వేతా శేఖర్ రెడ్డి

కల్వకుర్తి పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: శ్వేతా శేఖర్ రెడ్డి

0
6

కల్వకుర్తి పట్టణ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు: శ్వేతా శేఖర్ రెడ్డి

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు శ్వేతా శేఖర్ రెడ్డి, కల్వకుర్తి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పేర్కొన్నారు.

శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. భక్తి, ధర్మం, సేవాభావంతో ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

అలాగే తనపై విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న 11వ వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసేవకు మరింత అంకితభావంతో పనిచేస్తూ, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.

– కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here