తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షల
హిందూ సనాతన ధర్మంలో తొలి ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశిగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఉపవాస దీక్ష, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం, భజనలు, దానధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.
ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం ద్వారా మనసుకు ప్రశాంతత, కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరిలో భక్తి, సేవాభావం, సత్సంకల్పాలను పెంపొందించాలి.
ఈ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సుభిక్షాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– రచన: అజయ్ కౌండిన్య M.A., LL.B. PG Diploma in Journalism,Film Director..కల్వకుర్తి వార్తలు















