వెల్దండ గ్రామీణం: నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వెల్దండ మండలం పోతేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఎనుముల శిరీష (23) తన ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో కుమార్తె మానస్వి (3), కుమారుడు వర్షిత్ (4 నెలలు)ను పడేసి.. ఆపై తాను అందులోకి దూకేసింది. ఇందులో ఎవ్వరూ లేని సమయంలో పిల్లలతో కలసి శిరీష బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.. అంతేకాకుండా మూడు బాడీలను కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. త్వరలో పూర్తి వివరాలు చెప్తాము…
కల్వకుర్తి వార్తలు ప్రజల కోసం పోరాటమే చదువుతూ ఉండండి















