కల్వకుర్తిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఉన్న పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిల్డింగ్ డెవలప్మెంట్ కావచ్చు, బిల్డింగ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఫుడ్ విషయాలు కావచ్చు – ప్రతి అంశంలోనూ సమస్యలు కనిపిస్తున్నాయి.
కొన్ని హాస్టళ్లలో కనీసం డోర్లు, కిటికీలు కూడా సరిగా లేవు. హాస్టల్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ పలు చోట్ల పగిలిపోయి రంధ్రాలు ఏర్పడ్డాయి. హాస్టల్ ప్రాంగణం చెత్తాచెదారాలతో నిండిపోయింది. హాస్టల్ పక్కనే ఉన్న మురికి ప్రదేశాల నుంచి వస్తున్న దుర్వాసన విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
కొన్ని హాస్టళ్లలో బాత్రూమ్‌లకు సరైన నీటి వసతి కూడా లేదు. పాత బాత్రూమ్‌లు శిథిలావస్థలో ఉండటంతో పాటు మురికి పేరుకుపోయింది. మ్యాన్‌హోల్స్ కూడా పగిలిపోయి ఉండటంతో, అక్కడి నుంచి పాములు వంటి విషసర్పాలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇంతటి సమస్యలు ఉన్నప్పటికీ ఈ హాస్టళ్ల పరిస్థితి ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్తుందా లేదా అన్నది అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఏ నమ్మకంతో హాస్టళ్లలో ఉంటున్నారో ప్రశ్నార్థకంగా మారింది. రేపో మాపో బాత్రూమ్‌లలో, మురికి కాల్వల వద్ద లేదా కాంపౌండ్‌లోని రంధ్రాల ద్వారా వచ్చే పాముల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
ఈ సమస్యలను హాస్టల్ వార్డెన్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా తెలియదు. అయితే వార్డెన్లను అడిగితే, “ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. మేము ఏం చేయగలం?” అని సమాధానం చెబుతున్నారు.
అందువల్ల ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకోవాలి. హాస్టళ్లలో ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు సురక్షితమైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి హాస్టళ్లను సందర్శించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
మీ
అజయ్ కౌండిన్య
కల్వకుర్తి వార్తలు
Home ప్రాంతీయ వార్తలు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఉన్న పిల్లలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు















