*గుద్దటి లక్ష్మమ్మ కుటుంబానికి 4000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి*
తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామపంచాయతీ ఏడవల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గుద్దటి లక్ష్మమ్మ కుటుంబానికి భరోసా నిలవాలని యువజన కాంగ్రెస్ నాయకుడు గుద్దటి రాజ్ కుమార్ మృతురాలు చనిపోయిన విషయాన్ని వారి కుటుంబ పరిస్థితులను శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ & తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేయడంతో వారు తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ..తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 4000₹ నాలుగు వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.వారు చేసిన సహాయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులుకు తెలియజేసిన ఎడవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి 4000 రూపాయలను మృతురాలి కుమారుడు వెంకటయ్యకు అందజేశారు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు. 4000 వేల రూపాయల ఆర్థిక సాయం చేసిన తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి మృతురాలి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుద్దటి బాలయ్య, మరియు యువజన కాంగ్రెస్ నాయకులు గుద్దటి రాజ్ కుమార్, దుగ్గపురం రఘు, గుద్దటి శీను,లాలయ్య, గుద్దేటి కనకయ్య,గుద్దటి మల్లయ్య, గుద్దటి మహేష్,పిరికిరాల ఆంజనేయులు,చంద్రయ్య, బాలస్వామి,రవితేజ,లక్నమోని మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి వార్తలు















