కల్వకుర్తి ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు – డీడీకి ఫిర్యాదు
కల్వకుర్తి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో సరైన వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని హాస్టళ్లను పరిశీలించిన మేరకు సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని డిడి ఉమాపతి గారితో పాటు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం , జరిగిందని అజయ్ కౌండిన్య తెలిపారు.
హాస్టళ్లలో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, ప్రభుత్వం నుంచి విద్యార్థుల కోసం అందుతున్న నిధులు, ఇతర సదుపాయాలు సక్రమంగా విద్యార్థులకు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా హాస్టళ్లలో వర్కర్ల కొరత, వార్డెన్లు సరైన సమయానికి విధులకు హాజరు కాకపోవడం, రాత్రి వేళల్లో విద్యార్థుల భద్రత కోసం వాచ్‌మెన్ సక్రమంగా అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు.
హాస్టల్ భవనాల్లో ఉన్న సమస్యలు, చుట్టుపక్కల మురుగు కాలువలు, లైటింగ్, బెడ్లు తదితర మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు.
ఈ సమస్యలపై నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ ఉమాపతి గారికి అజయ్ కౌండిన్య ఫిర్యాదు చేశారు.
ఇకనైనా కల్వకుర్తి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో మార్పు తీసుకువచ్చి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అజయ్ కౌండిన్య.కల్వకుర్తి వార్తలు















