Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు *​వెల్‌జాల్ గ్రామంలో రసాభాస: ప్రజలపై భౌతిక దాడికి యత్నించిన పాలకవర్గం*

*​వెల్‌జాల్ గ్రామంలో రసాభాస: ప్రజలపై భౌతిక దాడికి యత్నించిన పాలకవర్గం*

0
32
*​వెల్‌జాల్ గ్రామంలో గ్రమసభ లో రసాభాస: ప్రజలపై భౌతిక దాడికి యత్నించిన పాలకవర్గం*

*ప్రజలు సమస్యలు అడిగితే ప్రజలపై భౌతిక దాడికి పాల్పడిన పాలక వర్గం*

*తాగునీటికి నోచుకోని 9 వార్డు సభ్యులు*

*తాగునీటి సమస్యను వార్డు సభ్యులు అడిగితే భౌతిక దాడికి పాల్పడిన ఉప సర్పంచ్ భర్త*

ఎక్కడ మినీ వాటర్ ట్యాంక్ ఉంటే అక్కడి నుంచి* *తెచ్చుకుని తాగండి అని వ్యంగ్యం గా మాట్లాడుతూ దూశిస్తున్న ఉప సర్పంచ్ భర్త*

*మండల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామ ప్రజలు*

వెల్‌జాల్ (న్యూస్‌లైన్):

గ్రామ సమస్యలను పరిష్కరించాల్సిన పాలకవర్గం, ప్రశ్నించిన ప్రజలపై తిరగబడిన ఘటన వెల్‌జాల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం నిర్వహించిన గ్రామసభ అధికారుల వైఫల్యం, పాలకవర్గం అహంకారపూరిత వైఖరితో తీవ్ర రసాభాసగా మారింది.

*​వెల్‌జాల్‌ లో అధికారం భార్య ది . పెత్తనం భర్తది*

​గ్రామంలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ భార్యల పేరిట పదవులు పొందిన భర్తలే గ్రామసభలో సర్వాధికారులు గా వ్యవహరిస్తుండటం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడుతున్నారు.

*​9వ వార్డులో చుక్క నీరు లేదు*

​గ్రామంలోని 9వ వార్డులో ఇప్పటివరకు తాగునీటి కనెక్షన్లు కూడా ఇవ్వకపోవడం పాలకవర్గం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గుక్కెడు మంచి నీటి కోసం వార్డు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, కనీస వసతులు కల్పించడంలో పంచాయతీ ఘోరంగా విఫలమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

*​ప్రశ్నిస్తే భౌతిక దాడికి యత్నం*

​గ్రామసభలో తాగునీటి సమస్యపై పాలకవర్గాన్ని ప్రశ్నించినందుకు, సమస్యను పరిష్కరించాల్సింది పోయి ప్రజల పైనే వ్యంగ్యంగా మాట్లాడుతూ, తీవ్ర పదజాలంతో దూషించారని స్థానికులు తెలిపారు. అంతటితో ఆగక, ప్రశ్నించిన వారిపై భౌతిక దాడికి సైతం యత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

​”ప్రశ్నించే హక్కును కాలరాస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే గ్రామసభలో పాలకులు చూపుతున్న ఈ అహంకారాన్ని అరికట్టేది ఎవరు?” అని గ్రామస్థులు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు.

*​అధికారుల జోక్యం కోసం డిమాండ్*

​వెల్‌జాల్ గ్రామంలో నెలకొన్న ఈ దారుణ పరిస్థితులపై మండల అధికారులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 9వ వార్డుకు వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలని, గ్రామసభ లో దౌర్జన్యానికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

 

రిపోర్టు. మొగిలిశెట్టి యాదగిరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here