Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు కోమిటి రెడ్డి మంజులరాణి స్మారకంతో రాములు యాదవ్. విల్ చైరు సహాయం..

కోమిటి రెడ్డి మంజులరాణి స్మారకంతో రాములు యాదవ్. విల్ చైరు సహాయం..

0
21

లేట్ శ్రీమతి లయన్ కోమటిరెడ్డి మంజులారాణి స్మారకార్థం దివ్యాంగుడికి రూ.10,000 విలువైన వీల్‌చైర్ అందజేత

Komatireddy Manjula Rani Trust ఆధ్వర్యంలో, లేట్ శ్రీమతి లయన్ కోమటిరెడ్డి మంజులారాణి గారి స్మారకార్థం నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా, చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన శ్రీ గజ్జ రామస్వామి గౌడ్ (60), శ్రీ నారాయణ గారి కుమారుడు గారికి రూ.10,000 విలువైన ప్రత్యేక అవసరాల వీల్‌చైర్ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డా. లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మరియు డైరెక్టర్ శ్రీ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి గారి చేతుల మీదుగా వీల్‌చైర్‌ను లబ్ధిదారునికి అందించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేట్ అధ్యక్షుడు లయన్ జాలి యాదగిరి రెడ్డి, జనరల్ సెక్రటరీ లయన్ రామచంద్ర, ట్రెజరర్ శ్రీ కోట్ల భాస్కర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్‌బీనగర్ సిందూర్ ఎన్‌క్లేవ్ చార్టర్ మెంబర్ లయన్ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి, లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవి సంగి, శ్రీమతి స్వర్ణలత, శ్రీ నాకినమోని రాములు యాదవ్, అలాగే సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేదలు, దివ్యాంగులు మరియు అవసరమైన వారికి చేయూతనివ్వడం Komatireddy Manjula Rani Trust యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. లేట్ శ్రీమతి లయన్ కోమటిరెడ్డి మంజులారాణి గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here