ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
విద్యార్థి యువజన ప్రజా విజయం సాకే హరి
నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థి,యువజన ప్రజా విజయమని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అన్నారు.శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ కారణంగా దేశ వ్యాప్తంగా 12మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సోనమ్ వాంగ్ చుక్ 19రోజులు ఆమరణ దీక్ష చేయడంతో దీక్షను భగ్నం చేశారని అభిజిత్ దీప్కే దీక్షను 27రోజులకు కొనసాగించడం దేశ చరిత్రలో మరచి పోలేమన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి.నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ తో 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు బగ్గిపాలు అయ్యాయని వాపోయారు.భవిష్యత్తు నాశనంగా మారిన విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ముందు నిరసన,ఆందోళనలు చేస్తే పోలీసులు వారి మీద లాఠీ ఛార్జ్,టీయార్ గ్యాస్, వాటర్ కెన్లు,పెల్లెట్స్ తో దాడి చేసి కేసులు నమోదు చేయడం అన్యాయం బేషరతుగా కేసులు ఎత్తివేయాలన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను స్వస్తి పలకాలని లేదంటే ప్రజా ఉద్యమాలు తీవ్ర తరంగా మారుతాయన్నారు.కార్యక్రమంలో ఐఎప్ టియూ నగర కార్యదర్శి దావీద్.బేడా బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి శిరిశాల అంజి.ఎమ్మార్పీఎస్ చిన్న ఆంజనేయులు,రజక సంఘం ఈశ్వరయ్య,జేఏసీ నేతలు మారెన్న, నారాయణ స్వామి, సూరి, కుళ్ళాయప్ప,శ్రీధర్,నల్లప్ప,రామాంజనేయులు,పాల్గొన్నారు.















