Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఎల్ఓసి అందజేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే..*

బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఎల్ఓసి అందజేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే..*

0
161

*బాధిత కుటుంబానికి రూ.4 లక్షల ఎల్ఓసి అందజేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి*

*తలకొండపల్లికి సి,సి రోడ్లు,అండర్ డ్రైనేజీలకు నిధులు మంజూరుకై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆవంచ నర్సింహారెడ్డి*

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఈటమోని కృష్ణయ్య యాదవ్‌ అనారోగ్య కారణంగా బాధపడుతున్న విషయాన్ని మండల కేంద్రానికి చెందిన కంటెస్టెడ్ సర్పంచ్ ఆవంచ నర్సింహారెడ్డి ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వివరించారు.వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఈటమోని కృష్ణ యాదవ్ కు మెరుగైన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4 లక్షల ఎల్ ఓ సి మంజూరయ్యాయి.దీనికి సంబంధించిన ఎల్ ఓ సి బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నివాసంలో ఆయన చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.తధానంతరం తలకొండపల్లి మండల కేంద్రానికి సిసి రోడ్లు,అండర్ డ్రైనేజీ నిర్మాణాలకై నిధులు మంజూరు చేయాలని కోరుతూ *కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి తలకొండపల్లి కంటెస్టెడ్ సర్పంచ్ అవంచ నరసింహారెడ్డి వినతిపత్రం అందజేశారు*.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం మండలంలోని దేవుని పడకల్ తదితర గ్రామాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నివాసంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తలకొండపల్లి కంటెస్టెడ్ సర్పంచ్ అవంచ నరసింహారెడ్డి,చెన్నారం గ్రామ సర్పంచ్ రాజు నాయక్,మీసేవ మల్లేష్, దేవుని పడకల్ మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం యాదవ్, తదితరులు ఉన్నారు.

 

అజయ్ కౌండిన్య… మనిషి బతికి ఉన్నప్పుడే హాస్పిటల్ కి సహాయం చేయటం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది.. మనిషి మరణం తరువాత కోటి రూపాయలు ఇచ్చిన పనికి రాని డబ్బులు ఎందుకు , కానీ MLA గారు మీరు చేసిన మంచి పని నాకు బాగా నచ్చింది I love MLA..

రచన

అజయ్ కౌండిన్య MA. LLB ఫిలిం డైరెక్టర్,, కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here