కల్వకుర్తి పట్టణానికి వచ్చే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా కొట్ర గేట్ వద్ద మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటుపై స్థానిక ప్రజల్లో చర్చ ఆగడం లేదు.
జాతీయ స్థాయిలో జైపాల్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. కానీ ఒక ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలంటే, ఆ ప్రాంతంతో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధం, అభివృద్ధికి చేసిన కృషి, ప్రజల జీవితాల్లో మిగిల్చిన ముద్ర వంటి అంశాలు కూడా పరిగణనలోకి రావాలి కదా?
కల్వకుర్తి ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు చిన్నవి కావు.
కల్వకుర్తి కోసం ఆయన తీసుకొచ్చిన ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టు ఏది?
ఈ ప్రాంత చరిత్రలో ఆయన పేరును శాశ్వతంగా నిలిపే ప్రత్యేక సేవ ఏమిటి?
ఇతర స్థానిక మహనీయులు, ఉద్యమకారులు, ప్రజా సేవకులు ఉండగా జైపాల్ రెడ్డి గారినే ఎందుకు ఎంపిక చేశారు?
ఈ నిర్ణయం ప్రజల అభిప్రాయంతో తీసుకున్నదా? లేక రాజకీయ నిర్ణయమా?
ప్రత్యేక హాస్పిటల్, విద్య సంస్థల పెంపు. రోడ్స్ మరియు కల్వకుర్తి కి. పేదలకోసం ఏమైనా గొప్ప కార్యక్రమం చేపట్టారా లేదా అయన చేసిన మంచి పనిని ప్రజలకు ఒక్కసారి చెబితే చాలా బాగుంటుంది.
ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన ప్రతి నిర్మాణం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రజలు ప్రశ్నిస్తే అది గౌరవాన్ని తగ్గించడం కాదు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కోరడం.
కల్వకుర్తి ప్రజలకు కావాల్సింది విగ్రహాల రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ విగ్రహం వెనుక ఉన్న ప్రమాణాలు, కారణాలు, ప్రభుత్వ నిర్ణయం ఏమిటో అధికారికంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
కల్వకుర్తి నీ,, జిల్లా చేసే దమ్ము ముఖ్య మంత్రికి ఏమైనా చేసే ఉద్దేశం ఉందా,… ఒకవేళ లేనప్పుడు , ప్రభుత్వం మారితే విగ్రహం తీసేయవచ్చు.. జిల్లా చేస్తే ప్రజలు విగ్రహానికి సేవకులు గా ఉంటారు కదా
ప్రశ్న ఒక్కటే…
కల్వకుర్తి ఎంట్రీలో జైపాల్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు? దానికి సంబంధించిన పూర్తి వివరణను ప్రజలకు ఎప్పుడు చెబుతారు?
– కల్వకుర్తి వార్తలు అజయ్ కౌండిన్య













