తల్లి ప్రేమకు ముగింపు లేదు… ఒకే రోజున తల్లిదండ్రులను కోల్పోయిన తొమ్మిది మంది సంతానానికి తీరని విషాదం
నవమాసాలు గర్భంలో మోసి, తన రక్తాన్ని పాలుగా మార్చి తొమ్మిది మంది సంతానానికి జన్మనిచ్చిన తల్లి… జీవితాంతం కుటుంబం కోసం కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసిన తండ్రి… అలాంటి ఆ తల్లిదండ్రులు ఒకే రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టడం తెల్లరాళ్లపల్లి తండాలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.
తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన కేతావత్ వంశానికి చెందిన హేమిలీ… తల్లీ కుటుంబంలో తొమ్మిది మంది సంతానం ఉన్నారు. వారిలో 9వ సంతానం భాస్కర్డు,చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, కష్టసుఖాల మధ్య పెరిగిన భాస్కర్‌కు ఒకే రోజున తల్లిదండ్రులను కోల్పోవడం జీవితంలోనే అతిపెద్ద విషాదంగా మారింది.
అమ్మ ప్రేమను మాటల్లో చెప్పలేం… నాన్న త్యాగాన్ని కొలవలేం. పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావించి, వారి భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలను భరించిన తల్లిదండ్రులు ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయారు. ఒకే రోజున ఇద్దరూ దూరం కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
“అమ్మ” అని పిలిస్తే పలికే స్వరం ఇక లేదు… “నాన్న” అని పిలిస్తే ధైర్యం చెప్పే చేయి ఇక లేదు. కానీ వారు నేర్పిన విలువలు, చూపిన ప్రేమ, చేసిన త్యాగాలు మాత్రం వారి సంతాన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.
ఒకే రోజున తల్లిదండ్రులను కోల్పోయిన ఈ కుటుంబ బాధను మాటల్లో చెప్పలేం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని. ప్రార్థిస్తున్నారు.💐💐🙏🙏🙏🙏🙏💐💐
అజయ్ కౌండిన్య…..రచన ఫిలిం డైరెక్టర్















