Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు maa inti bangaaram: మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ పరిస్థితి ఇదే 

maa inti bangaaram: మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ పరిస్థితి ఇదే 

0
22


maa inti bangaaram: మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ పరిస్థితి ఇదే 

Jul 7, 2026 5:37PM

సమంత(Samantha)పని ఇక అయిపోయిందా అనే అనుమానపు మాటలు అభిమానులు, ప్రేక్షకుల నోళ్ళల్లో వినిపిస్తున్న వేళ, మీ అనుమానాలు నా దగ్గర నడవవు అంటు  ‘మా ఇంటి బంగారం’ తో ఇచ్చి పడేసింది. రిలీజైన ఫస్ట్ డే నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రెజెంట్ సినీ రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి మార్కెట్‌లో ఉండే అంచనాలను తలకిందులు చేస్తూ, మూడో వారంలోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం ట్రేడ్ వర్గాలని  సైతం  ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కేవలం ఐదు రోజుల్లోనే 50 కోట్ల మైలురాయిని దాటగా, 100 కోట్ల క్లబ్‌కి అత్యంత చేరువలో నిలిచింది. స్టిల్  ప్రపంచవ్యాప్తంగా 96.74 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా సరికొత్త రికార్డుని  లిఖించింది. మా ఇంటి బంగారం  ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే, మొదటి రోజే థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2,658 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం తొలిరోజే రూ.13.25 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ.4.75 కోట్ల గ్రాస్ వసూలు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ.6.50 కోట్ల భారీ వసూళ్లు రావడం విశేషం. మిగిలిన ప్రాంతాలైన కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.38 లక్షల గ్రాస్ నమోదయ్యాయి. ఈ సినిమాకు లభించిన మౌత్ టాక్ కారణంగా మొదటి రోజు ఉదయం షోలకు కేవలం 26.15 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోల సమయానికి ఏకంగా 51.38 శాతానికి పెరిగింది. మరీ ముఖ్యంగా ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్‌లో ఏకంగా 96 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.

Also read: Vijay: అదంతా పక్కా ఫేక్.. మరి అంత హడావిడి చేసారుగా

‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై తన భర్త తో కలిసి సమంత  నిర్మించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి కీలక రోల్స్  పోషించగా, సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.నందిని రెడ్డి దర్శకురాలు.

 

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here