Friday, August 7, 2026
Google search engine
Home సినిమాలు sanjay dutt: నేను క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాను.. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగం 

sanjay dutt: నేను క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాను.. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగం 

0
5


sanjay dutt: నేను క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాను.. బసవతారకం ఆస్పత్రిలో సంజయ్ దత్ భావోద్వేగం 

Jul 7, 2026 11:36AM

 

భారతీయ చిత్ర పరిశ్రమకి దొరికిన అరుదైన ఆణిముత్యాల్లాంటి నటుల్లో సంజయ్ దత్(sanjay dutt)ఒకరు. మూడు దశాబ్దాల క్రితమే తెలుగు నాట కూడా భారీ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. హీరోగా తనకున్న ట్రాక్ రికార్డు నుంచి పక్కకి వచ్చి ప్రతినాయకుడిగా తన సత్తా చాటుతున్న సంజయ్ దత్ హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

హాస్పిటల్ లోని క్యాన్సర్ పేషేంట్స్ ను ఉద్దేశించి సంజయ్ దత్ మాట్లాడుతు ‘క్యాన్సర్ అనగానే భయపడి ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి మందుల కంటే మనోధైర్యమే అత్యంత కీలకమైన ఆయుధం.  మా అమ్మ క్యాన్సర్ కారణంగా మమ్మల్ని విడిచిపెట్టారు. కొన్నేళ్ల క్రితం నేనూ లంగ్ క్యాన్సర్ బారిన పడ్డాను. కానీ ధైర్యం కోల్పోలేదు. వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నాను. కాబట్టి  క్యాన్సర్ వచ్చిన వెంటనే నిరాశ చెందకుండా, ముందుగానే గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎంతో ఉన్నాయి.ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులని  సంప్రదించడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా చికిత్స పొందవచ్చు. మనోధైర్యమే పెద్ద మందు. క్యాన్సర్‌ని  చూసి భయపడకండి. వైద్యులపై నమ్మకం ఉంచి ధైర్యంగా పోరాడితే తప్పకుండా విజయం మీదే అవుతుంది అని స్పష్టం చేశారు. 

Also read: queen 2: విడుదలకు ముందే వివాదంలో క్వీన్ 2.. 250 కోట్ల భారీ లీగల్ నోటీసు!

ఆస్పత్రిలోని పలు విభాగాలను, ప్రత్యేకంగా చిన్నారుల వార్డుని  సందర్శించిన సంజయ్ దత్, అక్కడ చికిత్స పొందుతున్న చిన్న పిల్లలకు బహుమతులు, పండ్లను పంచిపెట్టి వారిలో కొండంత నమ్మకాన్ని నింపారు. బాలకృష్ణ(Balakrishna)ఆయన కుమార్తె నారా బ్రాహ్మణిలతో కలిసి ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలను కూడా  పరిశీలించారు .అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతుల విగ్రహాలకి పుష్పాంజలి ఘటించారు. సంజయ్ దత్ ని బాలకృష్ణ  శాలువాతో సత్కరించి  శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమని బహుకరించడం జరిగింది.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here