Friday, August 7, 2026
Google search engine
Home సినిమాలు వాడి కోసమే రూల్స్ అన్నీ మార్చుకున్నా.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

వాడి కోసమే రూల్స్ అన్నీ మార్చుకున్నా.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

0
5


వాడి కోసమే రూల్స్ అన్నీ మార్చుకున్నా.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

Jul 7, 2026 10:45AM

 

సుదీర్ఘ కాలం నుంచి తనదైన పెర్ఫార్మ్ తో అలరిస్తూ వస్తుంది కాజల్ అగర్వాల్. వివాహం తర్వాత  సెకాంగ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తుంది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో కాజల్ నే హీరోయిన్. అంతకంటే ముందు  ఈ నెల 24న  ‘ది ఇండియా స్టోరీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రీసెంట్ గా కాజల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఇకపై నేను ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాలన్నా మొదట తన కొడుకు నీల్ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తాను. వాడు కాస్త పెద్దయ్యాక థియేటర్లలో తన సినిమాలు చూసి.. “మా మమ్మీ చేసిన చాలా గొప్ప సినిమా ఇది” అని సమాజంలో ఎంతో గర్వంగా చెప్పుకునేలా తన క్యారెక్టర్స్ ఉండాలి. అందుకే ఇప్పుడు వస్తున్న కథల విషయంలో స్క్రిప్ట్ సెలెక్షన్‌ను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తున్నాను. కేవలం కమర్షియల్ హంగుల కోసమే కాకుండా, కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానని కాజల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also read: వైరల్ గా మారిన బండ్ల గణేష్ కూతురి పెళ్లి కార్డు.. ఎవరి ఆశీస్సులతో అని ఉందో తెలుసా!

‘ది ఇండియా స్టోరీ’లో  పవర్‌ఫుల్ లాయర్ గా కనిపించనున్నాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కల్తీ ఆహార సమస్యలు, వ్యవసాయంలో పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ఎలా బలి అవుతున్నాయనే వాస్తవాలు ఈ కథలో ఉన్నాయి.  స్క్రిప్ట్ విన్నప్పుడు ఒక తల్లిగా  తీవ్రంగా కలత చెందాను. ఈ మూవీ ఇచ్చిన అవగాహనతో షూటింగ్ పూర్తయిన వెంటనే వంటగదిలో ఏ వస్తువులు ఉంచాలి,నీల్‌కి  ఎలాంటి ఆహారం ఇవ్వకూడదో అప్పటికప్పుడే నిర్ణయించుకుని ఇంట్లో లైఫ్ స్టైల్ మార్చేసాను అని చెప్పుకొచ్చింది. ది ఇండియా స్టోరీకి చేతన్ డీకే దర్శకుడు కాగా  శ్రేయస్ తల్పడే హీరో. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, రాకింగ్ స్టార్ యశ్ ల ‘రామాయణ’ లో ‘మండోదరి’ క్యారక్టర్ లో కాజల్ కనిపిస్తున్న విషయం తెలిసిందే.

kajal aggarwal, balakrishna, ranbirkapoor, yash, sai pallavi



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here