కేటీఆర్ జన్మదిన వేడుకలు.. విద్యార్థులు, వృద్ధులకు పండ్లు – బిస్కెట్ ప్యాకెట్ల పంపిణీ
కల్వకుర్తి వార్తలు | ఊరుకొండ
తెలంగాణ యువ నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఊరుకొండ గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఊరుకొండ గ్రామ సర్పంచ్ మ్యాకల మంజుల శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి హైస్కూల్ విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ఊరుకొండ స్టేజి సమీపంలో వృద్ధులకు కూడా పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మ్యాకల మంజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రజా సేవే నిజమైన జన్మదిన వేడుక. సమాజంలోని విద్యార్థులు, వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మా ఆనందం. కేటీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత” అని పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
– కల్వకుర్తి వార్తలు