తలకొండపల్లి న్యూస్ | కల్వకుర్తి వార్తలు
వెల్జాల్ గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన సి.ఎల్ శ్రీనివాస్ యాదవ్
తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సి.ఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ చిత్రపటానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. కేటీఆర్ ప్రజాసేవా దృక్పథం, తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడుతూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సి.ఎల్ శ్రీనివాస్ యాదవ్ గత ఎన్నో సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా సేవలందిస్తూ, వెల్జాల్ గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు సామాజిక సేవలు చేస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. కేటీఆర్ అభిమానిగా ఆయన నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ శివ విజయ్ కుమార్ కూన శ్రీనివాసులు ఎండి ముజీబ్ ఏం బుచ్చయ్య జంగయ్య చీపిరి రమేష్ ఆయిల్ నరేందర్ సంపత్ ఏం పాపయ్య చీపిరి కృష్ణ సుల్తాన్ v శేఖర్ నేరడి జంగిల్ ఎండి సుభాన్ దూల శ్రీశైలం చెన్నకేశవులు రాజు జంగయ్య సత్యం గణేష్.. నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్: మొగిలిశెట్టి యాదగిరి..తలకొండపల్లి మండల ప్రతినిధి కల్వకుర్తి వార్తలు















