Thursday, August 6, 2026
Google search engine
Home తెలంగాణ పేద రైతులను మోసం చేస్తున్న రియల్టర్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

పేద రైతులను మోసం చేస్తున్న రియల్టర్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

0
75

పేద రైతులను మోసం చేస్తున్న రియల్టర్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి

కొంతమంది రియల్టర్లు, మధ్యవర్తులు (బ్రోకర్లు) కలిసి పేద రైతులను తీవ్రంగా మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యవసర అవసరాలను ఆసరాగా చేసుకుని కేవలం రూ.5 లక్షలు ఇచ్చి ఒక ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని, అనంతరం అక్రమ వడ్డీల పేరుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్వకుర్తి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు రైతులు చెబుతున్నారు. రైతులు రూ.5 లక్షలకు మించి డబ్బులు చెల్లించినప్పటికీ, అసలు నిర్వాహకులు లేదా హైదరాబాద్‌కు చెందిన రియల్టర్లు ఫోన్‌లు ఎత్తకుండా, కొన్నిసార్లు నంబర్లను బ్లాక్ చేసి రైతులను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి, రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పేద రైతుల భూములు, వారి జీవితాలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలి.

అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఉన్న కొందరు ముఖ్య రియల్టర్లు ఈ భూములను తీసుకుని, వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి, అసలు రైతులకు కేవలం ఐదు లక్షలు ఇచ్చి, ఆ భూములపై ఫైనాన్స్ సంస్థల నుంచి 50 లక్షలు, కోటి రూపాయల వరకు లోన్లు తీసుకుంటూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అసలు రైతులు మొత్తం అమౌంట్ చెల్లించిన తర్వాత కూడా స్పందన లేకపోవడంతో ఎంతో మంది నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీనిని అత్యంత సీరియస్‌గా తీసుకుని, పోలీస్ శాఖ ద్వారా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాము.

రచన: అజయ్ కౌండిన్య, ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి., ఫిల్మ్ డైరెక్టర్, కల్వకుర్తి వార్తలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here