Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు ఆరు నెలలు దాటినా పూత లేదు… కాత కాయలేదు… రైతు కన్నీరుమున్నీరు

ఆరు నెలలు దాటినా పూత లేదు… కాత కాయలేదు… రైతు కన్నీరుమున్నీరు

0
192

తలకొండపల్లి న్యూస్ | వెల్జాల్ గ్రామం

ఆరు నెలలు దాటినా పూత లేదు… కాత కాయలేదు… రైతు కన్నీరుమున్నీరు

తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన రైతు బొడ్డుపల్లి బాలస్వామి రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. గ్రామంలోని న్యూ స్వామి ట్రేడర్స్ ప్రొప్రైటర్ రామస్వామి గౌడ్ సూచన మేరకు కావేరి సీడ్స్ KMH-833 హైబ్రిడ్ విత్తనాలు అధిక దిగుబడిని ఇస్తాయని నమ్మి కొనుగోలు చేసి విత్తారు.

రైతు ఆరు నెలల పాటు ఎంతో శ్రమించి పంటను సాగు చేశారు. వర్షాలు సరిగా లేకపోయినా బోరుబావి నీటితో సాగు చేసి, దుక్కి దున్నించడం, ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులతో లక్షల రూపాయలు వెచ్చించారు. అయితే ఆరు నెలలు పూర్తయినప్పటికీ పంటకు పూత రాకపోవడంతో పాటు కాత కూడా కాయలేదు.

ఈ విషయంపై రైతు బొడ్డుపల్లి బాలస్వామి న్యూ స్వామి ట్రేడర్స్ ప్రొప్రైటర్ రామస్వామి గౌడ్‌ను సంప్రదించారు. అనంతరం ఆయన పొలాన్ని పరిశీలించి, “మీరు సరిగా మందులు కొట్టలేదు… ఇంకా మందులు వేయండి. మీరు నష్టపోతే నేను ఏం చేయగలను?” అంటూ బాధ్యత నుంచి తప్పించుకున్నారని రైతు ఆరోపిస్తున్నారు.

తనకు నాసిరకం (ఫేక్) విత్తనాలు విక్రయించి మోసం చేశారని, ఆరు నెలల కష్టాన్ని నష్టంగా మార్చారని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో పాటు పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి, రైతులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

అదేవిధంగా, న్యూ స్వామి ట్రేడర్స్ లైసెన్స్‌ను రద్దు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం అందించాలని రైతు బొడ్డుపల్లి బాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని వెల్జాల్ గ్రామ సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారులు మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– మొగిలిశెట్టి యాదగిరి .తలకొండపల్లి మండల ఇన్‌ఛార్జి.

కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here