కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా
*”ఈశ్వరమ్మ ను దూషించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి”*
*”జాతీయ BC సంక్షేమ సంఘం డిమాండ్”*యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, 82 ఏళ్ల BC యాదవ మహిళ *శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్* గారిపై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *జక్కిడి శివచరణ్ రెడ్డి* చేసిన అనుచిత, కుల అహంకారపూరిత వ్యాఖ్యలను *జాతీయ BC సంక్షేమ సంఘం* తీవ్రంగా ఖండించింది. ఫ్లెక్సీలో తన తండ్రి ఫోటో లేదనే కారణంతో ఈశ్వరమ్మ యాదవ్ గారిని శివచరణ్ రెడ్డి దూషించడంపై నేడు కల్వకుర్తి పట్టణంలో *జాతీయ BC సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్* ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా *రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్* మాట్లాడుతూ… కుల అహంకారంతో మాట్లాడిన శివచరణ్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని, ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. *అఖిల భారత యాదవ మహాసభ నాయకులు జూపల్లి రాముల్ యాదవ్ * మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి* గారు స్వయంగా గౌరవించి బోర్డు సభ్యురాలిగా నియమిస్తే, దాన్ని ఓర్చుకోలేక ఒక వర్గం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదవులకు పదవులు వస్తే రెడ్డి నాయకులు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డిల పార్టీయా? BC లకు విలువ లేదా? అని BC నాయకులు ప్రశ్నించారు.
శివచరణ్ రెడ్డి వెంటనే బహిరంగంగా ఈశ్వరమ్మ యాదవ్ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:*
*మల్లేష్ గౌడ్, అంజయ్య గౌడ్, రాముల్ యాదవ్, లక్ష్మయ్య గౌడ్, మధు, కాంత్, నిరంజన్, శ్రీనివాసులు, డేరంగుల శివ, బాలస్వామి గౌడ్* తదితరులు పాల్గొన్నారు.
ఈశ్వరమ్మ యాదవ్ ను పరామర్శించిన వారిలో రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర చైర్మన్. గద్వాల సరిత యాదవ్ గారు. సర్పంచుల వ్యవస్తాపకుడు భూమ న్న యాదవ్ గారు అంజలి యాదవ్. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షు రాలు. గొల్ల కూర్మ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాములు యాదవ్. గారు.
కల్వకుర్తి వార్తలు















