Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు Nagabandham: నాగబంధంకి బాక్సాఫీస్ షాక్.. 110 కోట్ల బడ్జెట్‌ కి వచ్చింది ఇంతేనా!

Nagabandham: నాగబంధంకి బాక్సాఫీస్ షాక్.. 110 కోట్ల బడ్జెట్‌ కి వచ్చింది ఇంతేనా!

0
3


Nagabandham: నాగబంధంకి బాక్సాఫీస్ షాక్.. 110 కోట్ల బడ్జెట్‌ కి వచ్చింది ఇంతేనా!

Jul 8, 2026 6:43PM

 

ట్రైలర్ తోనే అభిమానులని ఏర్పరుచుకున్న మూవీ ‘నాగబంధం'(Nagabandham). కొన్ని ఫ్యామిలీస్ అయితే నాగబంధం రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూసి మరి రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర బారులు తీరారు. ట్రైలర్ కల్పించిన ఇంపాక్ట్ ఆ లెవల్లో ఉంది. కానీ మేకర్స్ మంచి కంటెంట్ ని స్క్రీన్ ప్లే అవగాహనా లోపంతో కధనాన్ని నింపి పడేసారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీస్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన క్యారెక్టర్స్ కాగా, అభిషేక్ నామా దర్శకుడు. సుమారు 110 కోట్ల భారీ బడ్జెట్‌తో, విజువల్ గ్రాండియర్‌గా నిర్మితమైన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల  3న ప్రపంచవ్యాప్తంగా  భారీ స్థాయిలో విడుదలైంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,100 కి పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఘోరంగా వెనుకబడిపోయింది. మొదటి మూడు రోజుల వీకెండ్‌లో ఇండియా నెట్ కలెక్షన్ల పరంగా కేవలం 9.75 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇందులో మొదటి రోజు 3.25 కోట్లు, రెండో రోజు  3.05 కోట్లు మాత్రమే వసూలు కావడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్ కలెక్షన్లు అన్నింటినీ కలుపుకున్నప్పటికీ, మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు 13.70 కోట్ల నుండి కేవలం 15 కోట్ల లోపే పరిమితమయ్యాయి.100 కోట్ల బడ్జెట్ పెట్టిన మూవీకి   కనీసం 15 కోట్లు కూడా దాటకపోవడం భారీ డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.

Also read: jayam ravi: జయం రవి కీలక నిర్ణయం… అభిమానులు క్షమించాల్సిందే 

ఏది ఏమైనా కేవలం భక్తి అంశాలని  నమ్ముకుంటే సరిపోదని, వాటికి బలమైన కథ, కథనం తోడైతేనే ప్రేక్షకులు ఆదరిస్తారని ‘నాగబంధం’ ఫలితం మరోసారి నిరూపించింది. ప్రస్తుతం వర్కింగ్ డేస్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా థియేటర్లలో కనీస ఆక్యుపెన్సీని కూడా నమోదు చేయలేక బాక్సాఫీస్ రేసులో పూర్తిగా వెనుకబడిపోయింది. 

nagabandham, virat karna, nabha natesh

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here