Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు ‘కాన్ సిటీ’.. ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ.. బటన్ నొక్కితే డబ్బులే డబ్బులు.!

‘కాన్ సిటీ’.. ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ.. బటన్ నొక్కితే డబ్బులే డబ్బులు.!

0
16


‘కాన్ సిటీ’.. ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ.. బటన్ నొక్కితే డబ్బులే డబ్బులు.!

Jul 7, 2026 4:51PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’లో తన పవర్‌ఫుల్ యాక్టింగ్, గంభీరమైన వాయిస్‌తో తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు కోలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ దాస్. ఆయన హీరోగా, ‘కల్కి 2898 AD’ ఫేమ్ అన్నా బెన్ హీరోయిన్‌గా నటించిన సరికొత్త చిత్రం ‘కాన్ సిటీ’ (Con City). హరీష్ దురైరాజ్ దర్శకత్వంలో ఫ్యామిలీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల జూన్ 26న థియేటర్లలో విడుదలైంది. 

డిఫరెంట్ కంటెంట్, అదిరిపోయే ట్విస్టులతో కూడిన తమిళ, మలయాళ చిత్రాలకు ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి ఆదరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే బాటలో థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, ప్రముఖ సినిమా రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 9 రేటింగ్ సొంతం చేసుకుని ‘కాన్ సిటీ’ చిత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ క్రేజీ మూవీ కథాంశం విషయానికి వస్తే.. ఇందులో హీరో, హీరోయిన్, వారితో పాటు ఒక దివ్యాంగుడైన కుమారుడు ఉంటారు. వీరితోపాటే హీరోయిన్ తల్లి, ఆమె సోదరుడు కూడా కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమ గతాన్ని దాచిపెట్టి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసం  చిన్న చిన్న స్కామ్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒకరోజు ఊహించని విధంగా విలన్‌కు హీరో చాలా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతిలో రూపాయి లేని తీవ్రమైన నిరాశ, ఫ్రస్టేషన్‌లో తన ఇంట్లో ఉన్న ఒక పాత ప్రింటర్‌ను హీరో పగలగొట్టబోతుండగా, అనుకోకుండా అందులోని ఒక బటన్ ప్రెస్ అవుతుంది. ఆశ్చర్యకరంగా ఆ ప్రింటర్ నుండి ఒరిజినల్ రూ. 500 నోటు బయటపడుతుంది. అలా బటన్ నొక్కిన ప్రతిసారీ నోట్ల వరద కురుస్తూనే ఉంటుంది. అసలు ఆ ప్రింటర్ రహస్యం ఏంటి, ఆ తర్వాత ఈ ఫ్యామిలీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, కొడుకు కిడ్నాప్ వెనుక ఉన్న కథేంటి అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ క్రైమ్ కామెడీ సాగుతుంది.

బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ‘కాన్ సిటీ’ మూవీని జూలై 24 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు ఆడియోతో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. 

 

 

Arjun Das, Con City, Netflix, OTT, TeluguOne

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here