Friday, August 7, 2026
Google search engine
Home సినిమాలు ntr: లెనిన్ లో మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గర్జన.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారంటీ

ntr: లెనిన్ లో మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గర్జన.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారంటీ

0
5


ntr: లెనిన్ లో మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గర్జన.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారంటీ

Jul 6, 2026 5:01PM

 

 

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నెల 10 న రాబోతున్న అఖిల్ అక్కినేని లెనిన్(Lenin)మూవీ సందడి వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ఆ సందడి వాతావరణాన్ని రెట్టింపు చెయ్యడానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రంగంలోకి దిగాడు.

లెనిన్ లో శ్రీరామపురం, భారతమ్ మిట్ట అనే కీలకమైన ఏరియాలని  పరిచయం చేస్తూ, కథా నేపథ్యాన్ని వివరించే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ని  ఎన్టీఆర్ అందించారు.  తన గంభీరమైన కంఠస్వరంతో సినిమా ప్రారంభంలో ఇచ్చే ఈ ఇంట్రడక్షన్ థియేటర్లలో ప్రేక్షకులకి, అభిమానులకి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా లెనిన్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాకి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో తన వాయిస్ ని ఇవ్వడం లెనిన్ కి అదనపు మైలేజ్ కూడా. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్న స్టిల్స్ తో పాటు అఖిల్ తో దిగిన పిక్స్ వైరల్ గా మారాయి.

Also read: ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు.. అమౌంట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లెనిన్ కి  థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. జూన్ 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం 100 శాతం పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం జూలై 10కి వాయిదా పడింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాత్రలో కనిపిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ ఎంట్రీతో లెనిన్  బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని  సృష్టించడానికి సిద్ధమైపోయింది.  మురళి కిషోర్ అబ్బురు దర్శకుడు.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here