Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు అతను ఓ సైకో,నన్ను సిగరెట్‌తో కాల్చడంతో పాటు పిచ్చిగా కొట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన స్పీచ్

అతను ఓ సైకో,నన్ను సిగరెట్‌తో కాల్చడంతో పాటు పిచ్చిగా కొట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన స్పీచ్

0
6


అతను ఓ సైకో,నన్ను సిగరెట్‌తో కాల్చడంతో పాటు పిచ్చిగా కొట్టాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన స్పీచ్

Jul 6, 2026 3:03PM

 

 

-టాలీవుడ్ హీరోయిన్ నయా సంచలనం  
-ఆ సైకో నన్ను తీవ్రంగా హింసించాడు
-సిగెరెట్స్ తో కూడా కాల్చాడు

బాలనటుడిగా పలు చిత్రాల ద్వారా  ఆకట్టుకున్న తనీష్, ఆ తర్వాత హీరోగా పలు చిత్రాలు చేసాడు. వాటిల్లో ‘మేం వయసుకు వచ్చాం’ మూవీ ఒకటి. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన భామ నితీ టేలర్. మేం వయసుకు వచ్చాం కంటే ముందే   కేవలం 15 ఏళ్ల వయసులోనే  ‘ప్యార్ కా బంధన్’ అనే సీరియల్ ద్వారా తన నట ప్రస్థాన్ని స్టార్ట్ చేసింది. రీసెంట్ గా నితీ టేలర్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ అవుతున్న   ‘అలయన్స్’ రియాలిటీ షోలో పాల్గొంది. పాల్గొనడమే కాదు తన జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని బయటపెట్టి  అభిమానులని షాకింగ్ కి గురి చేసింది.  

ఆమె మాట్లాడుతు ‘నా మాజీ ప్రియుడు ఒక సైకో. ఒకసారి నా అంతర్గత భాగంపై సిగరెట్‌తో కాల్చాడు. తన పుట్టినరోజు నాడు మరింత రెచ్చిపోయాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తు  గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. దాంతో  అతనికి గుడ్ బై చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను. అప్పుడు తెలిసి తెలియని వయసు. చాలా చిన్నదాన్ని. మనుషులని  అంచనా వేయడం చేతకాక మోసపోయానని చెప్పుకొచ్చింది. ఈ మాటలు చెప్తున్నప్పుడు   నితీ ఫుల్ ఎమోషనల్ తో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

Also read: Ntr: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి గోల్డెన్ ఆఫర్.. జనగణమన, మెగా 158 సరసన నిలుస్తుందా!

ఇక తన వ్యక్తిగత జీవితంపై వచ్చే రూమర్లపై కూడా నితీ ఈ సందర్భంగా స్పందించింది. ‘నా భర్తతో విడిపోతున్నాననే రూమర్స్ ఎప్పట్నుంచో  వినిపిస్తున్నాయి. అలాంటి వార్తలపై స్పందించకపోవడమే కొన్నిసార్లు సరైన సమాధానం అవుతుంది. అక్కడ ఏమీ జరగనప్పుడు దానికి సంబంధించి ఎలాంటి వివరణలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదంటూ విడాకుల రూమర్లకి గట్టిగానే ఫుల్‌స్టాప్ పెట్టింది.  నితీ టేలర్ కి 2020 లో  ‘పరిక్షిత్’  అనే వ్యక్తితో వివాహం జరిగింది.

 


 
 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here