Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు sreeleela: శ్రీలీలకి కాబోయే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందోచ్.. అధికారకంగా తనే చెప్పింది

sreeleela: శ్రీలీలకి కాబోయే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందోచ్.. అధికారకంగా తనే చెప్పింది

0
10


sreeleela: శ్రీలీలకి కాబోయే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందోచ్.. అధికారకంగా తనే చెప్పింది

Jul 4, 2026 3:33PM

 

షార్ట్ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన శ్రీలీల(Sreeleela)తెలుగులో తన స్పీడ్ ని కొంచం తగ్గించినా బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తు బిజీగా ఉంది. ఎనర్జిటిక్ డ్యాన్స్‌ లకి పెట్టింది పేరైన శ్రీలీల తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి, ప్రేమ, కాబోయే భర్తకి  ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీలీల మాట్లాడుతు ఇప్పటివరకు నాకైతే ఎవరూ ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటే నా చుట్టూ ఎప్పుడూ ఒక రకమైన ‘అమ్మమ్మ వైబ్స్’ ఉంటాయని నా  స్నేహితులు చెబుతుంటారు. నేను  కోప్పడితే అందరూ సీరియస్‌గా తీసుకోకుండా నవ్వుతారని, బహుశా అందుకే ఇప్పటివరకు తనతో ఎవరూ అంతగా సింక్ అవ్వలే దేమో. నాకు  కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై  చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాకు  కాబోయే భర్త లుక్స్ పరంగా చాలా అందంగా, గ్లామరస్‌గా లేకపోయినా పర్వాలేదు. బాహ్య సౌందర్యం కంటే మనసు అందం ముఖ్యమని నమ్ముతాను.  నా లైఫ్ పార్ట్‌నర్‌లో ఖచ్చితంగా మూడు ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. మొదటిది.. అతను నన్ను ఎంతో బాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాడై ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే బంధం బలంగా ఉంటుంది. రెండవది.. ప్రొఫెషన్  సినీ కెరీర్‌కి నాకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాలి. మూడవది.. అన్నింటికంటే ముఖ్యంగా అతను చాలా నిజాయితీగా ఉండాలి. నాతో ఎంతో సరదాగా, జోవియల్‌గా సమయాన్ని గడపాలని చెప్పుకొచ్చింది.

ఈ సమాజంలో కేవలం పైపైన కనిపించే ఆడంబరాలు, అందాల కంటే.. నమ్మకం, నిజాయితీ, పరస్పర అవగాహన వంటి విలువలే ఒక వైవాహిక బంధాన్ని వంద శాతం విజయవంతం చేస్తాయని శ్రీలీల తన రిలేషన్‌షిప్ అడ్వైజ్ ద్వారా స్పష్టం చేసింది. . నెటిజన్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శ్రీలీలకి  కాబోయే మొగుడు నిజంగా అదృష్టవంతుడే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here