Thursday, August 6, 2026
Google search engine
Home సినిమాలు దీవాన మూవీ నిర్మాతలకు జాక్ పాట్!

దీవాన మూవీ నిర్మాతలకు జాక్ పాట్!

0
7


దీవాన మూవీ నిర్మాతలకు జాక్ పాట్!

Jul 4, 2026 7:41PM

సినీ పరిశ్రమలో కంటెంట్‌ను నమ్ముకుంటే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో లేటెస్ట్ మూవీ ‘దీవాన’ (Deewana) నిరూపించింది. సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది.. నమ్మకమే పెట్టుబడి అని. ఆ నమ్మకాన్ని, తమ సినిమాలోని కంటెంట్‌ను మాత్రమే నమ్ముకున్న దీవాన చిత్ర నిర్మాతలు మొదట కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, ఇప్పుడు ఏకంగా ఊహించని రేంజ్‌లో భారీ జాక్ పాట్ కొట్టారు. 

సాధారణంగా ఒక చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమా రూపొందుతున్నప్పుడు, నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లడం కోసం సినిమా విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మేసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ రికవరీ అయిపోయి, థియేట్రికల్ రిలీజ్ టైమ్‌కి టెన్షన్ తగ్గుతుందని భావిస్తారు. కానీ, దీవాన చిత్ర నిర్మాతలు మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్లారు.

తమ సినిమా అవుట్‌పుట్ పై ఉన్న నమ్మకంతో విడుదలకు ముందు తక్కువ రేట్లకు అడిగిన ఆఫర్లను వారు సున్నితంగా తిరస్కరించారు. కంటెంట్ పక్కాగా ఉంటే థియేటర్లలో రెస్పాన్స్ చూశాక అదే డిమాండ్ వస్తుందనే మొండి ధైర్యంతో నాన్-థియేట్రికల్ రైట్స్‌ను అస్సలు అమ్మకుండా హోల్డ్‌లో పెట్టేశారు. ఇప్పుడు వారి నమ్మకం నిజమైంది. 

ఈ సినిమా పాజిటివ్ రివ్యూల ఇంపాక్ట్ ఇప్పుడు నాన్-థియేట్రికల్ మార్కెట్‌పై గట్టిగా పడింది. విడుదలకు ముందు ఈ హక్కుల కోసం పెద్దగా ఆసక్తి చూపని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు, శాటిలైట్ ఛానెళ్లు ఇప్పుడు దీవాన రైట్స్ కోసం పోటీ పడటం విశేషం. ఈ క్రమంలోనే నిర్మాతలు ఆశించిన దానికంటే ఎక్కువగా, ఏకంగా రూ. 7 కోట్లకు పైగా భారీ ధర పలికి దీవాన నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఒక చిన్న చిత్రానికి ఈ స్థాయి బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రిస్క్ చేసి కంటెంట్‌ను నమ్ముకున్నందుకు నిర్మాతలకు ఒక జాక్ పాట్‌లా మారి లాభాల పంట పండిస్తోంది. 

 

 

Deewana Movie, Non Theatrical Rights, OTT Deal, TeluguOne

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here