కల్వకుర్తి నిర్మల విద్యాలయంలో విద్యార్థులపై మతమార్పిడి ఒత్తిళ్ల ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
కల్వకుర్తి పట్టణంలోని నిర్మల విద్యాలయంలో విద్యార్థులకు పురుగులు పట్టిన భోజనం అందిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు తమకు ప్రతి ఆదివారం చర్చికి రావాలని ఒత్తిడి చేస్తున్నారని, వెళ్లకపోతే పురుగులు పట్టిన భోజనం ఇస్తున్నారని, మోకాళ్లపై కూర్చోబెట్టి శారీరకంగా శిక్షిస్తున్నారని ఆరోపించినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏబీవీపీ నాయకులు కొంతమంది విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో కలిసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కల్వకుర్తి ఎస్‌ఐ కురుమూర్తి, విద్యార్థులు చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, హిందూ విద్యార్థులపై ఎలాంటి మతమార్పిడి ప్రయత్నాలు జరిగినా వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కల్వకుర్తి వార్తలు















