*అబ్దుల్లా పూర్ మెట్టు మండలం పెద్ద అంబర్పేట్ లో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టు రట్టు చేశారు మఠం పల్లి పోలీసులు.*
సూర్యాపేట జిల్లా మఠం పల్లి,మేళ చెరువులో కొంతమంది రైతులకి ఈ నకిలీ ఎరువులు డీ ఏ పి అమ్మటం తో అనుమానం వచ్చిన రైతులు మరియు అగ్రికల్చర్ అధికారులు మరియు పోలీస్ లకి పిర్యాదు చేయటం తో అసలు విషయం బయటపడింది.విచారణ లో బాగంగా రాత్రి సమయం లో డీసీఎం ద్వారా సరఫరా చేస్తున్న డీసీఎం డ్రైవర్ ను విచారణ చెయ్యగా పెద్ద అంబర్పేట్ లో తయారీ కేంద్రాన్ని చూపించడం తో ఇక్కడకి చేరుకున్న అధికారులకి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి.సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగ్ లు ప్రింట్ చేసి ఇక్కడే తయారీ చేసి ఉప్పు,పౌడర్ మరియు కలర్ తో తయారు చేసిన మందుని బ్యాగుల్లో నింపి సరఫరా చేస్తున్నారు.సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేయటం జరిగింది.సీజ్ చేసిన నకిలీ డి ఎ పి విలువ 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.నిందితుడు పరారీలో ఉండగా నిందితుని కోసం పోలీస్ లు గాలిస్తున్నారు….















