Thursday, August 6, 2026
Google search engine
Home ప్రాంతీయ వార్తలు విద్యానగర్ లో వెళ్తున్న కరెంటు వైర్స్ పోయే అవకాశం ఉంది

విద్యానగర్ లో వెళ్తున్న కరెంటు వైర్స్ పోయే అవకాశం ఉంది

0
47

కల్వకుర్తి పట్టణంలోని *విద్యానగర్ కాలనీలో ఇండ్లపై నుండి వెళుతున్న అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ వైర్లను వెంటనే తొలగించాలని గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు *శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారికి* విద్యానగర్ కాలనీవాసులు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు.*
ఈ సమస్య ఎంతో కాలంగా కాలనీలో పెద్ద సమస్యగా ఉంది. వైర్లు ఇండ్లకు అతి దగ్గరగా మరియు పైనుండి ఉండటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో షాక్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగే భయం కాలనీ ప్రజలను వెంటాడుతోంది.
ఇటీవల మున్సిపల్ ఎన్నికలకు ముందు గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీ వేదికగా ఈ సమస్యను లేవనెత్తి, కల్వకుర్తి నియోజకవర్గ వాసి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి *శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి* దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు విద్యానగర్ కాలనీలోని శాశ్వత సమస్యను పరిష్కరిస్తామని, వైర్లను తొలగిస్తామని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై కాలనీవాసులందరూ హర్షం వ్యక్తం చేశారు.గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారంటే తప్పక నిలబెట్టుకుంటారని ప్రజలందరూ నమ్ముతున్నారు.
100 పడకల ఆసుపత్రి నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, కొట్ర జంక్షన్ నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు 4 లేన్ల రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, అంతర్గత CC రోడ్లు వంటి అనేక కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.కావున గౌరవ శాసనసభ్యులు *శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి గారు* ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని, విద్యానగర్ కాలనీవాసుల జీవితాలకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము.

*ఇట్లు,*
*మల్లెపల్లి జగన్*
సీనియర్ న్యాయవాది
విద్యానగర్ కాలనీ,(contested)కల్వకుర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here