శ్రీశైలం టెంపుల్‌కు వెళ్తున్న భక్తులకు చిన్న విన్నపం
శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతం పచ్చని ప్రకృతి అందాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ అందాలను ఆస్వాదిస్తూ బైక్‌లపై శ్రీశైలం వెళ్లాలనుకుంటున్న బైక్ రైడర్లు, అలాగే భక్తులకు ఒక ముఖ్యమైన సూచన.
ఇటీవలి రోజుల్లో నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై పెద్దపులులు సంచరిస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇటీవల మన్ననూరు ప్రాంతంలో ప్రధాన రహదారిపైకి వచ్చిన పెద్దపులి రోడ్డు దాటిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అడవి జంతువుల సంచారం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల దయచేసి బైక్‌లపై ప్రయాణించకుండా, వీలైనంత వరకు బస్సు లేదా కారులో శ్రీశైలం ప్రయాణించండి.
మీ ప్రాణ భద్రతే అత్యంత ముఖ్యం. తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ప్రయాణించండి. పులితో పులిహోర కాకండి.
అజయ్ కౌండిన్య MA LLB.. కల్వకుర్తి వార్తలు















