Uncategorized

రేవల్లి యాదయ్య హత్య ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు?

రేవల్లి యాదయ్య హత్య ఘటన జరిగి ఇప్పటికే 48 గంటలు గడిచిపోయాయి. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను విచారిస్తున్నామని తెలియజేశారు. అయితే యాదయ్య కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అనే ప్రశ్న ప్రస్తుతం ప్రజల్లో ఉంది.
కల్వకుర్తి వార్తలు తరఫున మా ఆలోచన ఏమిటంటే… పోలీస్ శాఖను అనుమానించడం కంటే, వారి దర్యాప్తుకు సహకరించడం వల్ల కేసు మరింత ముందుకు సాగుతుందని మా నమ్మకం.
ఈ ఘటనలో నిజమైన నిందితులను గుర్తించి, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, యాదయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పోలీస్ డిపార్ట్మెంట్‌పై నమ్మకం ఉంచుతూ, యాదయ్య కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారు? నిందితులకు ఎలాంటి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు? అనేది వేచి చూడాలి.
ప్రజల తరఫున నిజాలను వెలుగులోకి తీసుకురావడమే కల్వకుర్తి వార్తలు లక్ష్యం.
మళ్లీ కలుద్దాం…
మీ అజయ్ కౌండిన్య
  కల్వకుర్తి వార్తలు

Related posts

గంజాయికి చెక్ పెట్టేందుకు పోలీసుల అవగాహన

Kalwakurthyvarthalu

ఒక విద్యార్థి.. ఒక టీచర్

Kalwakurthyvarthalu

మిత్ర ఫౌండేషన్… విద్యా భవిష్యత్తుకు భరోసా

Kalwakurthyvarthalu

Leave a Comment