గంజాయికి చెక్ పెట్టేందుకు పోలీసుల అవగాహన

0
20
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: true; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;

గంజాయికి చెక్ పెట్టేందుకు పోలీసుల అవగాహన కార్యక్రమం… విద్యార్థులకు సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐ యుగేందర్ రెడ్డి సందేశం

“గంజాయి అనే మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలిద్దాం… యువత భవిష్యత్తును కాపాడుదాం” అనే సంకల్పంతో వెల్దండ పోలీస్ శాఖ ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

వెల్దండ రోడ్డుపై పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ రఘువీరారెడ్డి, ఎస్ఐ యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ… గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు.

“ఒక విద్యార్థి జీవితాన్ని కాపాడటం అంటే ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడటమే. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి” అని వారు పిలుపునిచ్చారు.

విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని పోలీస్ అధికారులు తెలిపారు.

— కల్వకుర్తి వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here