ప్రాంతీయ వార్తలు

బాల్యం నుంచే కష్టాల కడలి… నేడు ప్రజల మనిషిగా ఎదిగిన వానరాశి వెంకటేష్

జీవితంలో ఎదురయ్యే కష్టాలు కొంతమందిని కుంగదీస్తాయి… మరికొంతమందిని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. అలాంటి కష్టాలను ఎదుర్కొని, తన జీవితాన్ని తానే నిర్మించుకున్న వ్యక్తి వానరాశి వెంకటేష్.
నిరుపేద కుటుంబంలో జన్మించిన వెంకటేష్ చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, చదువుపై ఉన్న ఆసక్తితో గ్రామంలోని హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఎన్నో బాధలు ఆయనకు జీవిత పాఠాలు నేర్పాయి.
తనకు ఎదురైన కష్టాలను అధిగమిస్తూ, తన కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ, తన తమ్ముళ్ల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ ముందుకు సాగారు. ఎదగాలి… సాధించాలి… కుటుంబానికి అండగా నిలవాలి అనే ఒకే లక్ష్యంతో తన ప్రయాణాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వెంకటేష్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. తన కృషి, పట్టుదలతో సంస్థను అభివృద్ధి చేసి, వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
అయితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తన గతాన్ని మరచిపోలేదు. తాను అనుభవించిన పేదరికం, కష్టాలు గుర్తు చేసుకుంటూ… పేద ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రజల మధ్య ఉండాలి… ప్రజల సమస్యలకు అండగా నిలవాలి అనే ఆలోచనతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. నేడు వెలిజాల గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం పొందారు.
పేదరికం నుంచి వచ్చిన వ్యక్తికే పేదల కష్టాలు పూర్తిగా అర్థమవుతాయని చెప్పడానికి వెంకటేష్ జీవితం ఒక ఉదాహరణ. తాను ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి బాధ ఆయనకు ప్రజల సమస్యలను అర్థం చేసుకునే శక్తిని ఇచ్చింది.
వెలిజాల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తూ, తన వంతు సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
కష్టాల నుంచి ఎదిగి, ప్రజల మనిషిగా నిలిచిన నా మిత్రుడు వానరాశి వెంకటేష్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అజయ్ కౌండిన్య
ఫిలిం డైరెక్టర్
కల్వకుర్తి వార్తలు

Related posts

 పెను భూతంలా పట్టిన చేతబడి, ఒక మూఢనమ్మకం నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

Kalwakurthyvarthalu

నటి నీతా శర్మ యొక్క లుక్ సౌత్ చిత్రం “The 7 DEATHS”

Kalwakurthyvarthalu

వంగూరు ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: సర్పంచ్ పురుగుల యాదయ్య

Kalwakurthyvarthalu

Leave a Comment