ప్రాంతీయ వార్తలు

కల్వకుర్తి షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపుల కేటాయింపుపై పేదలకు న్యాయం చేయాలి

ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ,నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయించడం ఒక మంచి ఆలోచన. అయితే, ఈ కేటాయింపుల విషయంలో నిజమైన అర్హులైన నిరుపేద కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.
నాకు తెలిసిన సమాచారం మేరకు, ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లో కొంతమంది ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారు, మంచి వ్యాపార స్థితిలో ఉన్నవారు, మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఆర్థికంగా స్థిరపడిన వారికి షాపులు కేటాయించారని కొంతమంది నిరుపేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నిజంగా ఉపాధి అవసరం ఉన్న పేద కుటుంబాలకు అవకాశం దక్కకపోవడంతో వారు బాధపడుతూ, తమకు న్యాయం చేయాలని నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని బాధితులు చెబుతున్నారు.
కావున కల్వకుర్తి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి, నిజమైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి షాపులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక పేద కుటుంబానికి ఒక అవకాశం లభిస్తే వారి జీవితం మారుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలు అర్హులైన వారికి చేరితేనే సామాజిక న్యాయం జరుగుతుంది.
— అజయ్ కౌండిన్య
   కల్వకుర్తి వార్తలు

Related posts

నటి నీతా శర్మ యొక్క లుక్ సౌత్ చిత్రం “The 7 DEATHS”

Kalwakurthyvarthalu

బాల్యం నుంచే కష్టాల కడలి… నేడు ప్రజల మనిషిగా ఎదిగిన వానరాశి వెంకటేష్

Kalwakurthyvarthalu

వంగూరు ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: సర్పంచ్ పురుగుల యాదయ్య

Kalwakurthyvarthalu

Leave a Comment