సిద్ధాంతం అమ్మాయి భవాని సినీ రంగ ప్రవేశం… “కన్నీరు” సినిమాతో కొత్త ప్రయాణం ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లా సిద్ధాంతం ప్రాంతానికి చెందిన భవాని తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అనుకోకుండా వచ్చిన సినీ అవకాశాన్ని అందిపుచ్చుకుని, నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగుతున్న భవాని, “కన్నీరు” అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏకే నేను ఫీలింగ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన బాధ్యతలు టి.ఆర్.వి. అజయ్ కౌండిన్య నిర్వహిస్తూ, నటుడిగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
సినిమా రంగంలో అడుగు పెట్టడం ప్రతి ఒక్కరికీ ఒక సవాలే. కానీ వచ్చిన అవకాశాన్ని కష్టంతో, అంకితభావంతో సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లే వారికి విజయాలు తప్పకుండా వస్తాయి.
భవాని గారి ఈ తొలి సినీ ప్రయాణం విజయవంతం కావాలని, తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని కోరుకుంటూ…
భవాని గారికి “కన్నీరు” సినిమా ద్వారా మంచి గుర్తింపు రావాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని కల్వకుర్తి వార్తలు తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
— కల్వకుర్తి వార్తలు ప్రత్యేక కథనం













