వంగూరు ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: సర్పంచ్ పురుగుల యాదయ్య

0
14

వంగూరు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ప్రశాంతంగా ఉండాలని వంగూరు గ్రామ సర్పంచ్‌ పురుగుల యాదయ్య ఆకాంక్షించారు.

కల్వకుర్తి వార్తలు ద్వారా మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం ప్రజలకు అవసరమైన పనులు పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల క్షేమమే తన క్షేమమని, వంగూరు గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని సర్పంచ్‌ యాదయ్య పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సహకారంతో వంగూరును మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here