వంగూరు మండల సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాదవరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా మండల ప్రజలకు ఒక సందేశాన్ని తెలియజేశారు.
మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా తమ కుటుంబాలతో జీవించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రజల భద్రతే తన ప్రధాన బాధ్యత అని ఎస్సై మాదవరెడ్డి గారు పేర్కొన్నారు
.














